Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (10:51 IST)
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న మద్యం స్కామ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభ వేదికగా చేసిన ఆరోపణలపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఎంపీకి తన కార్యాలయానికి పిలుపించుకుని ఏపీ లిక్కర్ స్కామ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ఎంపీని తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు సేకరించారు. 
 
సోమవారం లోక్‌సభ టీడీపీ ఎంపీ లావు మాట్లాడుతూ, ఏపీలో మద్యం స్కాంకు కారకులైన వారిపై దర్యాప్తు చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా శ్రీకృష్ణదేవరాయలను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకున్న హోం మంత్రి  అమిత్ షా ఆయనను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 
 
ఢిల్లీ మద్యం స్కాం‌తో పోల్చితే ఏపీలో ఈ స్కామ్ ఎన్నో రెట్లు అధికంగా జరిగిందని మంత్రికి లావు వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ఆయన హోంమంత్రికి అందజేశారు. రూ.90 వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, మరో రూ.4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించారని లావు సంచలన ఆరోపణలు చేశారు. వీటిపైనే హోం మంత్రి ఆరా తీశారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఎన్.సునీల్ రెడ్డి దుబాయ్‌కు చెందిన రూ.2 వేల కోట్లను తరలించినట్టుగా ధృవీకరించే కీలక పత్రాలను ఈ సందర్భంగా అమిత్ షాకు ఎంపీ అందించారు. ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరిపిస్తామని ఈ సందర్భంగా హోం మంత్రి ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ కుంభకోణం కారణంగానే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారని లావు ఈ సందర్భంగా వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments