Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో షికారుకు వెళ్లిన యువతిపై అత్యాచారం

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (17:25 IST)
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని అలా షికారుకు వెళ్లిన యువతిపై అత్యాచారం జరిగింది. ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమ జంటను బెదిరించి యువకుడిని బంధించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో హోంగార్డు. 
 
ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. గ్రామ శివారుకు వెళ్లిన వారిని చూసిన హోంగార్డ్ రాజ్ కుమార్.. పోలీసు వాహనంతో వెళ్లి స్టేషన్‌కు రావాలని బెదిరించాడు. దీంతో వదిలేయని ప్రాధేయపడిన ఆ ప్రేమ జంట వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. 
 
వారు తమ వద్దనున్న డబ్బులు ఇవ్వడంతో తీసుకున్న రాజ్‌కుమార్‌ ఆపై యువకుడిని బంధించి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితులు నిన్న దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
నిందితుడు రాజ్‌కుమార్‌ది విజయనగరం కాగా, ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ డీఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments