Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణ టిక్కెట్ ధర రూ.5.. పార్కింగ్ ఫీజు చార్జీ రూ.564 :: రైల్వేస్టేషన్‌లో నిలువుదోపిడీ

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (16:55 IST)
హైదరాబాద్‌ నగరంలోని హైటెక్ సిటీ నుంచి ఎంఎంటీఎస్‌కు ప్రయాణ టిక్కెట్ ధర రూ.5. కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కారు పార్కింగ్ చేస్తే గంటకు రూ.47. జీఎస్టీతో కలుపుకుని. అలా ప్రతి గంటకు రూ.47 చొప్పున ఎన్ని గంటలు పార్క్ చేస్తే అన్ని రూ.47 చొప్పున చెల్లించాల్సి వుంటుంది. దీంతో సగటు ప్రయాణికుడు జేబుకు చిల్లుపడుతోంది. రైల్వే అధికారులు పార్కింగ్ చార్జీల పేరుతో నిలుపుదోపిడీకి పాల్పడుతున్నారని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. 
 
ఈ నిలువుదోపిడీ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్ మొదటిగేటు వద్ద ఉన్న పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ వసూలు చేస్తున్న చార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఇక్కడ ఒక మోటారు సైకిల్‌ను పార్క్‌ చేస్తే.. జీఎస్టీతో కలిపి గంటకు రూ.18.. రోజుకు రూ.425 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే కారుకైతే జేబు గుల్లయ్యేలా బిల్లు ఇస్తున్నారు. 
 
గంటకు రూ.47 చొప్పున పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రతి గంటకు అదే మొత్తంలో ఫీజును పెంచుతూ పోతున్నారు. ఇక్కడికి కూత వేటు దూరంలో ఉన్న ప్రైవేటు పార్కింగ్‌ కేంద్రంలో బైక్‌కు రోజుకు రూ. 60, కారుకు రూ. 100 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. దీనిపై రైల్వే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments