Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని పిటిషన్లపై మరోమారు విచారణ వాయిదా

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (15:15 IST)
నవ్యాంధ్రకు మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. 
 
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, పాలన వికేంద్రీకరణ జరుపుతామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత హైకోర్టులో అమరావతి రైతులు, మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. 
 
గతంలో హైకోర్టు సీజే‌గా ఉన్న జస్టిస్ జె.కె.మహేశ్వరి ఈ వ్యాజ్యాలను విచారించారు. తుది దశకు చేరుకునే సమయంలో అప్పటి ఆయన బదిలీ కావడంతో వ్యాజ్యాలను మళ్లీ మొదటి నుంచి విచారిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, చీఫ్ జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు సోమవారం పిటిషన్లపై విచారణ చేపట్టింది. రాజధాని కేసుల విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. 
 
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టుకే వదిలేశారు. ఈ క్రమంలో విచారణను నవంబరు 15వ తేదీకి హైకోర్టు వాయిదావేసింది. 
 
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది మార్చి 26న మొదటిసారి విచారణ జరిపి మే 3కు వాయిదా వేసింది. అనంతరం విచారణ సందర్భంగా.. కొవిడ్‌ నేపథ్యంలో న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఆగస్టు 23కు ధర్మాసనం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఫతే సెట్స్ లో నసీరుద్దీన్ షాకు గైడెన్స్ ఇస్తున్న సోనూ సూద్

తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 1.82 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్న గం..గం..గణేశా

యేవ‌మ్ నుంచి ర్యాప్ సాంగ్ విడుద‌ల చేసిన త‌రుణ్‌భాస్క‌ర్

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం