Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్ ఉంటేనే ఆఫీస్ ఎంట్రీ.. లేదంటే నో ఎంట్రీ.. ఖంగుతింటున్న ఖాకీలు

రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు వివిధ రకాల చర్యలు చేపడుతున్నారు. అలాగే, విస్తృతమైన అవగాహన ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.

Webdunia
గురువారం, 3 మే 2018 (11:27 IST)
రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు వివిధ రకాల చర్యలు చేపడుతున్నారు. అలాగే, విస్తృతమైన అవగాహన ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, ఇపుడు సాధారణ ప్రజలతో పాటు పోలీసులు కూడా వీటిని ఖచ్చితంగా పాటించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది.
 
ముఖ్యంగా, వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు నిర్బంధ హెల్మెట్ నిబంధనను పాటించాలంటూ ఆదేశాలు వెళ్లాయి. దీంతో పోలీస్ కమిషనరేట్‌లోకి బైక్‌పై హెల్మెట్ లేకుండా వస్తున్న పోలీసులను అనుమతించడం లేదు. హెల్మెట్ ధరించిన పోలీసులను మాత్రమే అనుమతిస్తున్నారు. 
 
పోలీస్ బాస్‌లు తీసుకున్న నిర్ణయానికి కిందస్థాయి సిబ్బంది నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో హెల్మెట్‌ను విధిగా ధరిస్తున్నారు. రూల్స్ తాము పాటించకపోతే సాధారణ ప్రజలు ఎలా పాటిస్తారనీ, వారిపై ఎలా చర్యలు తీసుకుంటామని పలువురు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో విధిగా హెల్మెట్ ధరిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments