Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోస్తా, రాయలసీమ జిల్లాలో 29, 30 తేదీల్లో భారీగా వర్షాలు?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2015 (09:43 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్ష పాతం కూడా 7 నుంచి 12 సెంటీమీటర్ల భారీ, 13 నుంచి 24 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 
 
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాలపైనా ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 
 
ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా 29వ తేదీన కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, 30న కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ బలమైన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలతో దక్షిణ కోస్తా జిల్లాలు కోలుకోకముందే, మరోసారి బలమైన అల్పపీడనం ఏర్పడటంతో ఐఎండీ వర్గాలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments