Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ భారీ వర్షం.. వినాయక నిమజ్జనానికి ఆటంకం

హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షం పడుతోంది. దీంతో నగరమంతా నీట మునిగిపోయింది. ఈ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గత రాత్రంతా కురిసిన వర్షం ఈ తెల్లవారి కాస్తంత తెరిపినిచ్చినట్టు కనిపించినా, ఆపై ఉ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (10:33 IST)
హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షం పడుతోంది. దీంతో నగరమంతా నీట మునిగిపోయింది. ఈ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గత రాత్రంతా కురిసిన వర్షం ఈ తెల్లవారి కాస్తంత తెరిపినిచ్చినట్టు కనిపించినా, ఆపై ఉదయం 7 గంటల నుంచి తిరిగి కురుస్తుండటంతో, గురువారం జరగాల్సిన గణేష్ నిమజ్జనం, శోభాయాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 
 
ముఖ్యంగా ఖైరతాబాద్‌లో కొలువైన మహా గణపతి నిమజ్జన యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. వర్షాల కారణంగా వెల్డింగ్ పనులు ఆలస్యం అవుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో, విగ్రహాలను లారీలపైకి తెచ్చే పనులు నిదానంగా సాగుతున్నాయి.
 
ట్యాంక్ బండ్‌లో దాదాపు 8 వేల విగ్రహాలు గురువారం నిమజ్జనం కానున్న నేపథ్యంలో, అందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 34 క్రేన్లు అందుబాటులో ఉండగా, పోలీసు నిఘా కోసం 44 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ వైఫై సాయంతో పనిచేయనున్నాయి. ఇక గణేష్‌ ఊరేగింపు సాగే రహదారుల్లో సుమారు 12 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments