Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద‌కాకానిలో 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (10:41 IST)
గుంటూరు జిల్లా పెద‌కాకానిలో స్థానిక ఎన్నిక‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌డంతో అక్క‌డ పోలీసుల నిఘా ఎక్కువ‌గా పెట్టారు. అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్ పోలింగ్ కేంద్రాల త‌నిఖీకి వ‌చ్చారు. వెంగళ్రావు పోలింగ్‌ కేంద్రం వివరాల‌ను ఆయ‌న‌కు సీఐ బండారు సురేష్‌బాబు వివ‌రించారు. 
 
 
పెదకాకాని సర్పంచి, వార్డు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ తెలిపారు. గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లను అర్బన్‌ ఎస్పీ పరిశీలించారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో స్థానిక సీఐ బండారు సురేష్‌బాబుకు ఎస్పీ పలు సూచనలు చేశారు. 

 
ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 40 పోలింగ్‌ కేంద్రాలుండగా, లూథర్‌గిరి కాలనీ, వెంగళ్రావునగర్‌ కాలనీలో 16 సమస్యాత్మక బూత్‌లను గుర్తించామన్నారు. లూథర్‌గిరి కాలనీలో డీఎస్పీ స్థాయి అధికారిని కేటాయించన్నట్లు తెలిపారు. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది సహకారం పోలీసులు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments