Webdunia - Bharat's app for daily news and videos

Install App

విసురుతున్న చలి పులి..! మన్యం విలవిల..!! విశాఖ వల వల

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (10:09 IST)
ఉదయం తొమ్మదైనా బయలకు రావాలంటే భయం వేస్తుంది. సాయంత్రం నాలుగైతే ఇళ్లు చేరుకోవాల్సిందే.. ఇక మేఘాలు కమ్ముకున్నాయంటే ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాల్సిన పనే లేదు. ఒకటే చలి.. చేతులు నీలక్కపోతున్నాయి. కాళ్ళు కదలవు. ఇక చక్కెర వ్యాధిగ్రస్తులైతే మాట్లాడాల్సిన పనే లేదు. ఇది మన్యం పరిస్థితి. విశాఖ ప్రాంతంలో పల్లె పట్నం అనే తేడా లేకుండా చలి పులి అందరిని వణికించేస్తోంది. 
 
విశాఖ ప్రాంతంలో చలి తడాఖా చూపుతోంది. నగరవాసుల్ని అల్లాడిస్తోంది. గురువారం నుంచి మొదలైన చలి శుక్రవారానికి మరింత ఊపందుకుంది. ఏజెన్సీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. లంబసింగి, పాడేరు ఘాట్‌లలో 6 డిగ్రీలులకు పడిపోయింది. చింతపల్లి,మినుములూరు ల్లో 9 డిగ్రీలు నమోదయ్యాయి. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లే వారు ముఖాలకు స్కార్ఫ్‌లు, మాస్క్‌లు వేసుకున్నా చలి వదిలిపెట్టడం లేదు. ఉదయం 
 
ఈ చలి ఇక రాత్రయ్యే సరికి  మరింత పెరుగుతోంది. మరో నాలుగైదు రోజుల పాటు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య గాలులు విశాఖ వైపు వీస్తున్నాయి. ఉత్తర దిక్కులో ఉన్న చత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఉన్న ఒడిశాలో కూడా చలి అధికంగా ఉంది.  చత్తీస్‌గఢ్, ఇటు ఒడిశా, ఏజెన్సీల నుంచి వచ్చే చల్లగాలులు విశాఖ నగర వాసుల్ని వణికిస్తున్నాయి. గురువారం విశాఖ విమానాశ్రయంలో కనిష్ట ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలు నమోదవగా, శుక్రవారం 18.8 డిగ్రీలకు దిగజారింది. ప్రస్తుతం వరినూర్పిడి పనులకు వెళ్ళుతున్న గిరిజన రైతులు చలిలో వణుకుతూనే మంచులో వణికిపోతున్నారు. 

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments