Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఒక్క రోజు... 222 మంది మృతి.. ప్రచండ భానుడు

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (07:45 IST)
ఎక్కడ చూసినా ఎండ ఎండ.. ఈ సమ్మర్ చివర్లో ఇదే చర్చ. వేసవి మధ్యలో కాస్తంతగా వర్షాలు పడడంతో ఊరట చెందిన జనం మే చివర్లో ప్రచండ భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్నారు. ఒకే ఒక్క రోజులో 222 మంది పిట్టల్లా రాలిపోయారు. ఎంతగా ఉన్నాయంటే ఉష్టోగ్రతలు ఎన్నడూ లేని విధంగా 47కు చేరుకున్నాయి. 
 
మే నెలలో సాధారణంగా వేడి ఎక్కువ. ఇది మామూలే. గురువారం మరీ ఎక్కువగా కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భానుడు తన ప్రతాపాన్ని జనంపై చూపారు. అత్యధికంగా సూర్యాపేటలో 47.5 డిగ్రీల ఉష్టోగ్రత నమోదయ్యింది. ఇక రామగుండంలో 46.8, నిజామాబాద్ లో 46.6, హైదరాబాద్ లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
ఆంధ్రప్రదేశ్ ఏమైనా చల్లగా ఉందా అంటే అలాంటి పరిస్థితులు ఏమి కనిపించడం లేదు. రెంట చింతలో 47 డిగ్రీలు, గుంటూరులో 45.8, తిరుపతి 45 డిగ్రీలు నమోదయ్యాయి. వీటికి వడగాల్పులు తోడవడంతో తెలంగాణలో 147 మంది చనిపోయారు. కరీంనగర్, నల్గొండ జిల్లాలలో 31 మంది చొప్పున, ఖమ్మం జిల్లాలో 27, వరంగల్ లో 23 చనిపోగా, ఏపీలో 78 మృత్యువాత పడ్డారు. మరో రెండు రోజుల పాటు ఈ ఎండలు ఇలాగే ఉండవచ్చునని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments