Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యతో ఆ సంబంధం పెట్టుకున్నాడు, వాడిని చంపేద్దాం అంటూ ఫ్రెండ్‌ను పిలిచిన భర్త

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:31 IST)
గుంటూరు జిల్లా నరసరావు పేటలో వెంకటగిరి అనే వ్యక్తి పాడుబడిన బావిలో శవమై తేలాడు. దీనికి కారణం అతడు మరో వివాహితతో వివాహేతర సంబంధాన్ని కలిగి వుండటమేనని పోలీసులు తేల్చారు.
 
పూర్తి వివరాలను చూస్తే.... నరసరావు పేటలోని జొన్నలగడ్డ గ్రామానికి చెందిన వెంకటగిరి అదే గ్రామానికి చెందిన నాగరాజు భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. విషయాన్ని తెలుసుకున్న నాగరాజు భార్యను హెచ్చరించాడు. ఐనా ఫలితం లేకపోవడంతో ఇక వెంకటగిరిని చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. దానితో తన స్నేహితుడు వీరబ్రహ్మాన్ని పిలిచాడు.
 
తన భార్యతో ఎఫైర్ సాగిస్తున్న వెంకటగిరిని చంపేయాలనీ, అతడిని మద్యం తాగుదామని చెప్పి పిలుచుకుని రమ్మన్నాడు. వెంకటగిరిని మద్యం సేవించేందుకు గ్రామ సమీపంలో గల సుబాబుల్ తోటలోకి రమ్మన్నాడు వీరబ్రహ్మం. అతడు రాగానే అతడితో పూటుగా మద్యం తాగించి ఆ తర్వాత బండ రాయితో మోదారు. అనంతరం గొడ్డలితో నరికి హత్య చేసారు. ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు అతడి శవాన్ని బావిలో పడేశారు.
 
అతడు వేసుకొచ్చిన ద్విచక్ర వాహనాన్ని కూడా బావిలో వేసారు. ఐతే బావిలో గుర్తు తెలియని శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరీశించిన పోలిసులు హత్య కేసుగా నమోదు చేసారు. ఐతే ఇక దొరికిపోవడం ఖాయమనుకున్న నిందితులు గ్రామ వీఆర్వో ఎదుట నేరాన్ని అంగీకరించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments