ఆ బాలికను అనుభవించాడా? సరే ఈ 30 వేలు తీసుకుని కేసు వాపస్ తీసుకోండి

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (17:46 IST)
చిత్తూరు జిల్లాలో ఓ బాలిక శీలానికి రూ. 30 వేలు వెల కట్టారు. 15 ఏళ్ల బాలికను 30 ఏళ్ల యువకుడు మాయ మాటలు చెప్పి ఎక్కడెక్కడో తిప్పి ఆమెను అనుభవించి ఆ తర్వాత ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయాడు.
 
పూర్తి వివరాలను చూస్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె పరిధిలోని శివాజీనగర్‌లో తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలికపై కన్నేసాడు 30 ఏళ్ల హరీష్. ఆమెకు మాయమాటలు చెప్పి గత 19వ తేదీన ఆమెను తీసుకెళ్లిపోయాడు. బాలిక ఆచూకి లభించకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకి ఫిర్యాదు చేసారు. పోలీసులు బాలిక కోసం వెతుకుతుండగానే ఆమెను ఇంటి వద్ద వదిలివెళ్లాడు హరీష్.
 
ఇంటికి వచ్చిన బాలిక తనపై హరీష్ చేసిన వ్యవహారాన్నంతా చెప్పింది. దీనితో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐతే అదే రాత్రి హరీష్ తరపు పెద్దలు రూ. 30 వేలు ఇస్తామనీ, కేసు వాపసు తీసుకోమని చెప్పారు. అందుకు బాలిక బంధువులు అంగీకరించకపోవడంతో నిన్న రాత్రి బాలిక బంధువుల ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడి వారిని చితక్కొట్టారు. ఈ దాడిలో బాలిక బంధువులు పెద్ద రెడ్డెమ్మ, చిన్న రెడ్డెమ్మ గాయపడ్డారు. దాడి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమకు ప్రాణ హాని వుందని తమను రక్షించాలని పోలీసులను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments