ఫేక్ న్యూస్ వేసిన చోటే రేపు క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:39 IST)
పాఠకులను ఏప్రిల్ ఫూల్స్ చేసేందుకు ఓ ఆంగ్లపత్రిక రాసిన కథనం ఇపుడు చిక్కుల్లో పడేసింది. ఏదో సరదాగా చేయాలని ప్రారంభించిన ఒక కథనానికి బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
 
వివరాలలోకి వెళ్తే... ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఏప్రిల్ ఒకటో తేదీనాటి సంచికలో తెరాస కీలక నేత హరీష్ రావు ఆ పార్టీని వీడి... బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనానికి చివర్న ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ అందర్నీ ఫూల్స్‌ను చేసింది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ... ఈ కథనంపై తెరాస నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
'నా గురించి ఓ ప్రముఖ మీడియా సంస్థ నుండి వచ్చిన కథనం ఫేక్ న్యూస్‌లకు ఒక ఉదాహరణ మాత్రమే. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదు. ముఖ్యంగా దేశం మొత్తం ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో ఇలా వ్యవహరించడం సముచితమైనది కాదు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను ప్రచురించవద్దని మీడియా సంస్థలను కోరుతున్నానని పేర్కొన్న ఆయన... ఏ పేజీలో అయితే తనపై తప్పుడు వార్తను ప్రచురించారో...  అదే పేజీలో రేపు తనకు క్షమాపణలు చెప్పాలి.' అంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments