Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హోదా' పేరెత్తితే జగన్ ఇబ్బందుల్లో పడతారు : జీవీఎల్ వార్నింగ్

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:48 IST)
ప్రత్యేక హోదా అనే అంశంపై వ్యవస్థలో లేదని, అందువల్ల మరోమారు హోదా మాటెత్తితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడతారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహా రావు సుతిమెత్తగా హెచ్చరించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీఎం జగన్.. ప్రధాని మోడీకి లేఖ రాయడంపై జీవీఎల్ బుధవారం ఢిల్లీలో స్పందించారు. హోదా అనే వ్యవస్థే లేదని, అలాంటి లేని వ్యవస్థ కోసం మాట్లాడితే జగన్ రాజకీయంగా ఇబ్బంది పడతారని హెచ్చరించారు. 
 
ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రాజెక్టుల కోసం రూ.22 వేల కోట్లు అదనంగా కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని జగన్‌కు కూడా తెలుసునని అన్నారు. ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ఉద్దేశం కేంద్రానికి లేదని జీఎల్ పునరుద్ఘాటించారు. 
 
అలాగే, రాజధాని వ్యవహారంపై కేంద్రం మంగళవారం లోక్‌సభలో చేసిన ప్రకటనపై కూడా స్పందించారు. రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందనే విషయాన్ని కేంద్రం వెల్లడించిందన్నారు. కానీ, కొంత మంది ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు వింటుంటే తనకు ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వ ప్రకటనలను, జవాబులను ఈవిధంగా వక్రీకరించడం తగదని హితవు పలికారు.
 
రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని అనేక సందర్భాల్లో తాను చెప్పానని అన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని, అది మారడానికి వీల్లేదని కేంద్రం నిర్ణయించినట్టుగా ప్రతిపక్ష నేతలు చెబుతుండటాన్ని అమాయక వ్యాఖ్యలో, మోసపూరిత వ్యాఖ్యలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాజధాని అంశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments