Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్ - అబ్బాయ్‌ చేతివాటం.. బ్యాంకుకు కన్నంవేసి.. డబ్బు శ్మశానంలో దాచిపెట్టారు..

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (20:54 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నడికుడిలోని భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ బ్యాంకులో మొత్తం 85 లక్షల రూపాయలు చోరీకి గురైన విషయం తెల్సిందే. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రాథమిక విచారణలో లభించిన ఆధారాల మేరకు... నిందితులను నల్గొండ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
నల్గొండ జిల్లా మిర్యాలగూడ గాంధీ నగర్‌కు చెందిన కేదారి వినయ్‌రామ అనే వ్యక్తి పాత ఇనుప సామాగ్రి వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. దేకాలనీకి చెందిన కేదారి ప్రసాద్‌ అనే యువకుడు ఓ టీస్టాల్‌లో బాయ్‌గా పనిచేస్తున్నాడు. 
 
వీరిద్దరూ వరుసకు బాబాయ్ - అబ్బాయ్ అవుతారు. వీరిద్దరూ ఏపీ రాష్ట్రంలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్టు గతంలో పోలీసులు నిర్ధారించారు. అయితే, పోలీసుల చేతికి చిక్కకుండా చాకచక్యంగా నడుచుకుంటూ వస్తున్నారు. 
 
ఈ క్రమంలో దాచేపల్లి మండలంలో కొంతకాలంగా పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేస్తున్న వినయ్‌రామ నడికుడిలోని ఎస్‌బీఐ శాఖలో దొంగతనానికి ప్రణాళిక రూపొందించుకున్నాడు. కొన్ని రోజులు ప్రసాద్‌తో కలిసి బ్యాంకు పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. 
 
ఈ నెల 21వ తేదీన బ్యాంకుకు అధిక మొత్తంలో నగదు వచ్చిందని తెలుసుకుని అదేరోజు రాత్రి చిన్న గ్యాస్‌ సిలిండర్‌, గ్యాస్‌ కట్టర్‌తో బ్యాంకు తాళాలను తొలగించి లాకర్‌ గదిలోని ఓ పెట్టెలో ఉన్న రూ.85లక్షలు దొంగిలించారు.
 
తాళాలు వేసిన ఇళ్లలో చేరీలకు పాల్పడ్డ సందర్బాల్లో వేలిముద్రలు, సీసీ కెమెరా పుటేజీలు, డాగ్‌ స్క్వాడ్‌ ఆధారాలతో పోలీసులకు చిక్కిన వీరు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పక్కా వ్యూహంతో వ్యవహరించారని పోలీసులు నిర్ధారించారు. 
 
బ్యాంకు తాళాలను, లాకర్‌ను తొలగించే సమయంలో వేలిముద్రలు పడకుండా గ్లౌజులు ధరించారు. డాగ్‌స్క్వాడ్‌ పసిగట్టకుండా ఉండేందుకు బ్యాంకులో కారంపొడి చల్లారు. బ్యాంకులో అలారం మోగకుండా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. సీసీ కెమెరాలో ఫుటేజీ నమోదుకాకుండా కేబుల్‌ను కట్‌ చేశారు. 
 
నడికుడి బ్యాంకులో చోరీ చేసిన రూ.85 లక్షల నగదులో రూ.45లక్షలు దాచేపల్లి మండల కేంద్రంలోని సుబ్బమ్మ హోటల్‌ సమీపంలోని శ్మశానవాటిక గోడపక్కన గోతిలో దాచిపెట్టారు. అనంతరం మిర్యాలగూడకు ఓ లారీలో వచ్చారు. మిగిలిన సొమ్మును ఇద్దరూ ఇళ్లలో దాచిపెట్టారు. 
 
గురువారం తెల్లవారుజామున నిందితుల ఇళ్లను సోదా చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. వినయ్‌రామ తన ఇంట్లో రూ.16 లక్షలు, ప్రసాద్‌ ఇంటి ఎదురుగా ఉన్న బండరాళ్లకుప్పలో రూ.15.70 లక్షల నోట్లకట్టలను పోలీసులు గుర్తించారు. మిగిలిన నగదును నిందితులు ఏం చేశారన్నది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments