Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఆన్‌లైన్‌ వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న గుంటూరులో ఆన్‌లైన్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో ఆన్‌లైన్ వ్యభిచార నిర్వాహకుడితోపాటు, ఏజెంట్లను పోలీసులు అరెస్

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2017 (08:43 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న గుంటూరులో ఆన్‌లైన్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో ఆన్‌లైన్ వ్యభిచార నిర్వాహకుడితోపాటు, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన ఇటంశెట్టి సూర్య వెంకట శివప్రసాద్‌ (ఆలియాస్‌ బాలాజీ) అనే వ్యక్తి అమ్మాయిలను సరఫరా చేస్తానంటూ మూడు నెలల క్రితం ఓ వెబ్‌సైట్ ప్రారంభించాడు. గుంటూరుతోపాటు విశాఖ, నెల్లూరు, తిరుపతి నగరాల్లో శాఖలు ఏర్పాటు చేసి ఏజెంట్లను కూడా నియమించాడు.
 
ఆ తర్వాత గుంటూరు నగరంలోని రాజీవ్‌గాంధీనగర్‌‌తో పాటు తిరుపతిలోని మారుతీనగర్‌లోని ఇళ్ళలో అమ్మాయిల ఉంచేవారు. బాలాజీకి ఆన్‌లైన్‌లో కస్టమర్స్‌ ఫోన్‌ చేస్తే అతనే ధర నిర్ణయించి బేరం కుదిరితే ఆయా ఏజెంట్ల మొబైల్ నంబర్లు, చిరునామాను వారికి యిచ్చేవాడు. ఏజెంట్లు వారి వద్ద డబ్బును వసూలు చేసి సగం తీసుకుని మిగిలిన సగం బాలాజీ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. 
 
దీనిపై పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈనెల 7వ తేదీన గుంటూరు నగరంలో పనిచేసే ఇద్దరు ఏజెంట్లు, విటుడు సాయిప్రసాద్‌ని అరెస్ట్‌ చేసి... అక్కడ దొరికిన ముగ్గురు అమ్మాయిలను రిస్క్యూ హోంకు తరలించారు. మిగిలిన వారి ఆచూకి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments