Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే బిల్లు కలెక్టర్.. అవినీతిలో అనకొండ.. రూ.80 కోట్ల ఆస్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అవినీతి అధికారిని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు పట్టుకున్నారు. పేరుకు బిల్లు కలెక్టర్‌గా ఉన్న ఆయన.. అవినీతిలో మాత్రం అనకొండను మించిపోయాడు. విధి నిర్వహణలో అడ్డదారులు

Webdunia
గురువారం, 31 మే 2018 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అవినీతి అధికారిని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు పట్టుకున్నారు. పేరుకు బిల్లు కలెక్టర్‌గా ఉన్న ఆయన.. అవినీతిలో మాత్రం అనకొండను మించిపోయాడు. విధి నిర్వహణలో అడ్డదారులు తొక్కి సంపాదించిన ఆస్తుల విలువ ఏకంగా రూ.80 కోట్ల పైమాటగానే ఉంది.
 
గుంటూరు నగర పాలక సంస్థలో ఈ అవినీతి అధికారిని పట్టుకున్నారు. ఆయన పేరు ముద్రబోయిన మాధవ్. ఈయన అక్రమంగా సంపాదించిన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. ఈయకు గుంటూరులో ఏడు చోట్ల, మాచవరం మండలంలో రెండు చోట్ల, ఇతర ప్రాంతాల్లో నివాసాలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నివాసాల్లో ఏకకాలంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రూ.50 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించగా, ఇవి మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ రూ.80 కోట్లకు పైగానే ఉంటుందని డీఎస్పీ దేవానంద్ తెలిపారు.
 
2011లో తన తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో గుంటూరు నగరపాలక సంస్థలో బిల్ కలెక్టర్‌‌గా రెవెన్యూ విభాగంలో చేరిన మాధవ్.. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో గుంటూరు, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రికి చెందిన ఎనిమిది మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 20 ప్రాంతాల్లో ఇంటి స్థలాలు గుర్తించామని, నాలుగు గృహాలు సీజ్ చేశామని, ఒక కారు, రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 200 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు భారీగా లభించినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments