Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత యువకుడితో వైశ్య యువతి ప్రేమ వివాహం.. కిడ్నాప్!

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:36 IST)
గుంటూరులో ఓ యువతి కిడ్నాప్‌కు గురైంది. ఆ యువతి చేసిన నేరం.. దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. పైగా, ఆ యువతి వైశ్య కులానికి చెందిన యువతి. దీంతో ఆమె తల్లిదండ్రులు యువతిని కిడ్నాప్ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన వైశ్య యువతి సౌమ్య, దళిత యువకుడు దిలీప్ ప్రేమించుకున్నారు. గత జూలై నెలలో వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. గుంటూరులో కాపురం పెట్టారు. 
 
పెళ్లైనప్పటి నుంచి వీరికి బెదిరింపులు వస్తున్నాయి. 'నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య గుర్తుందిగా... ప్రణయ్ మాదిరి హత్య చేస్తా'మంటూ యువతి తల్లిదండ్రులు తనకు వార్నింగులు ఇస్తూ బెదిరించారని చెప్పాడు.
 
అంతేకాదు పోలీసులతో తనను బెదిరింపజూశారని, ఆ తర్వాత ఇంట్లో ఉన్న తన భార్యను కిడ్నాప్ చేశారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన తల్లిని కొట్టారని ఆ యువకుడు తెలిపాడు. దీంతో, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి అతను ఫిర్యాదు చేశాడు. 
 
తాజాగా జరిగిన ఈ ఘటన గుంటూరులో కలకలం రేపుతోంది. తమ కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతాను.. ఉదయం 4గంటలకల్లా నిద్రలేస్తాను.. సాయిపల్లవి

రాజమౌళి వల్లే సినిమా ఒక్కటైంది, మేం తెలుగు సినిమాలు చూస్తాం : మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments