వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన కాంపౌడర్

ఠాగూర్
బుధవారం, 26 నవంబరు 2025 (08:08 IST)
గుంటూరు నగర శివారులోని ఓ ప్రైవేట్ వైద్య కాలేజీ ఆస్పత్రిలో పని చేసే మేల్ నర్స్ ఒకరు పాడుపనికి పాల్పడ్డాడు. మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుండగా, వారిని వీడియో తీశాడు. దీన్ని గమనించిన కొందరు వైద్య విద్యార్థులు పత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ మేల్ నర్స్‌ను అరెస్టు చేశారు. అలాగే, అతని ఫోనును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాడు. 
 
ఈ కేసు వివరాలను డీఎస్పీ భానోదయ వివరిస్తూ, 'నెల రోజుల క్రితం వెంకటసాయి అనే వ్యక్తి ఈ ఆసుపత్రిలో మేల్‌ నర్స్‌గా చేరాడు. ఆపరేషన్‌ థియేటర్‌లో మహిళా వైద్యులు, పీజీ విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా అతను ఫోన్‌తో వీడియోలు తీశాడని ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అతడి ఫోనులోని వీడియోలను అప్పటికే మహిళా వైద్యులు డిలీట్‌ చేశారు. ఆ డేటాను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిందితుడి ఫోనులో 200కు పైగా వీడియోలు ఉన్నట్టు వైరల్‌ అవుతున్న విషయం తెలిసింది. కానీ దానికి ఆధారాల్లేవు' అని డీఎస్పీ తెలిపారు. అయితే, మేల్ నర్స్ ఈ పాడుపనిని ఆస్పత్రిలోనే చేశాడా.. బయటకూడా చేశాడా అనేదానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ నుంచి గిర గిర గింగిరాగిరే సాంగ్

Vanara: సోషియో ఫాంటసీ కథతో అవినాశ్ తిరువీధుల మూవీ వానర

Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments