Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై మోజు.. భర్తకు సుగంధి సోడాలో మత్తు మందు కలిపి?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (15:33 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో, గుంటూరులో ప్రియుడి మోజులో భర్తను చంపేయాలనుకుంది ఓ భార్య. ప్రియుడిని అప్పుడప్పుడు కలుస్తుండిన భార్యను భర్త మందలించడంతో.. భర్తను చంపేయాలనుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామానికి చెందిన కొమ్మన బోయిన నాగరాజు(22)కి ఆరు నెలల కిందట కొల్లిపర మండలం పిడపర్రు పాలెంకు చెందిన గౌతమీ (19)తో పెళ్లైంది. 
 
అంతకుముందే వేరే వ్యక్తిని ప్రేమిస్తున్న గౌతమీ తీరు అనుమానాస్పదంగా మారింది. ప్రియుడితో ఆమె వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ సంభాషణలపై పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. తప్పైపోయిందని క్షమాపణ కోరింది. ఆ తర్వాత మళ్లీ మామూలే. 
 
రాఖీ పండుగ రోజున పుట్టింటికి భర్తలో వెళ్లిన ఆమె  సుగంధి సోడాలో మత్తు మందు కలిపి భర్తకు ఇచ్చింది. దీంతో అనారోగ్యానికి గురైన నాగరాజు గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments