ఆ బెంగతోనే నాని అస్వస్థతకు గురయ్యారా..? సోఫాలో కుప్పకూలిపోయారు..

సెల్వి
గురువారం, 23 మే 2024 (20:41 IST)
మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సరళి పరిశీలిస్తే ఎమ్మెల్యేగా నాని ఓడిపోతారని తెలిసినట్టు సమాచారం. ఈ బెంగతోనే నాని అస్వస్థతకు గురయ్యినట్లు చర్చ జరుగుతోంది. గుడివాడలోని తన స్వగృహంలో గురువారం నందివాడ మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కొడాలి నాని సమీక్ష నిర్వహించారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌ పరిస్థితిని నాయకులను ఆరా తీశారు. మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా నాని సోఫాలో కుప్పకూలిపోయారు. కొన్ని నెలల కిందట అనారోగ్యానికి గురైన నాని మళ్లీ అస్వస్థతకు గురవడం కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తుంది.
 
కొడాలి నాని కుటుంబం ఎప్పటి నుంచో హైదరాబాద్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో కొడాలి అనారోగ్యానికి గురైన విషయాన్ని సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు హుటాహుటిన బయలుదేరి వస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments