Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి కౌంట్డౌన్ స్టాట్స్

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (18:14 IST)
జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. అత్యంత బరువైన ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన ఈ రాకెట్ కోసం బుధవారం ఉదయం 8 గంటల 30 నిముషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 9 గంటలకు ఈ రాకెట్‌ నింగలోకి దూసుకెళ్లనుంది. 
 
ఈ విషయమై ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనన్నారు. రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ను అమర్చినట్లు తెలిపారు. ఇది భూమి నుంచి 136 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేస్తుందన్నారు. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకుంటుందని తెలిపారు. 
 
దీనిని అండమాన్ కు సమీపంలోని సముద్రంలో దీనిని నెలపై దింపేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే .. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి కుదురుతుందని తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments