Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్ఎల్ వీ- ఎఫ్‌10 రాకెట్ ప్రయోగం విఫ‌లం

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (07:51 IST)
మ‌న శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌యోగించిన జీఎస్ఎల్ వీ- ఎఫ్‌10 రాకెట్ ప్రయోగం విఫ‌లం అయింది. శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలోని సతీష్‌ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భూఅధ్యయన స్వదేశీ ఉపగ్రహం ఈఓఎస్ -03 ను భూస్థిర కక్ష్య లో ప్రవేశపెట్టే జీఎస్ఎల్ వీ- ఎఫ్‌10 రాకెట్ ప్రయోగం మూడో దశలో విఫలమైంది.

క్రయోజనిక్ ఇంజనులో ఏర్పడిన లోపం కారణంగా రాకెట్ గమనం మారి, అంతరిక్ష ప్రయోగ కేంద్రంతో సంబంధాలు కోల్పోయినట్లు ఇస్రోచైర్మన్ శివన్ ప్రాథమికంగా ప్రకటించారు. ఈ ఉపగ్రహ ప్రయోగం గత ఏడాది వాయిదా పడింది. ఎట్టకేలకు కరోనా పరిస్థితులను అధిగమించి ఉపగ్రహ ప్రయోగాన్ని కొనసాగించినప్పటికీ అనివార్య పరిస్థితులు తలెత్తి విఫలమైంది.

జీఎస్ఎల్ వీ సీరీస్ లోని వాహన నౌక మార్క్ -3 వంటి భారీ అంతరిక్ష ప్రయోగాలను విజయవంతం చేసినప్పటికీ , మార్క్ -2 టైప్ లో గతంలోనూ విఫలఘటనలు ఎదురయ్యాయి. మార్క్ 2 టైప్ జీఎస్ఎల్ వీ- ఎఫ్‌ 10 విషయంలోనూ క్రయోజనిక్ విభాగంలో మరోసారి లోపం తలెత్తి అప్రశృతి చోటు చేసుకొని శాస్త్రవేత్తలలో నిరాశను నింపింది. 26 గంటల నిరంతర కౌంట్ అనంతరం ఉదయం 5.43 నిముషాలకు నింగికి పయనమైన జీఎస్ఎల్ వీ 18 నిముషాల 39 సెకండ్లకు లక్ష్యాన్ని చేరుకోవాల్సిన తరుణంలో నాలుగు నిముషాల 56 సెకడ్లకే సాకేంతిక లోపం తలెత్తి గమనం మారడంతోపాటు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నంచి సంబంధాలు కొల్పోయాయి.

గత ఏడాది మార్చిలో ఈ ప్రయోగాన్ని తలపెట్టినప్పటికీ సాంకేతిక లోపాల కారణంగా వాయిదా వేసి ఎట్టకేలకు ప్రయోగం చేపట్టినప్పటికీ సాంకేతిక సమస్య వీడక విఫలమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments