Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (07:55 IST)
గ్రూప్‌-1 మెయిన్స్‌ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే 9,679 మంది అభ్యర్థుల కోసం ఏపీ, తెలంగాణల్లో 41 కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 7 సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.

ఈ నెల 14న తెలుగులో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌), 15న ఇంగ్లి్‌షలో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌), 16న పేపర్‌-1, 17న పేపర్‌-2, 18న పేపర్‌-3, 19న పేపర్‌-4, 20న పేపర్‌-5 జరుగుతాయి. పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్‌లోనే అందజేస్తారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లీషు, తెలుగు వెర్షన్‌లో స్ర్కీన్‌లో కనిపిస్తాయి.

అన్ని పేపర్లు కూడా డిస్ర్కిప్టివ్‌లోనే ఉంటాయి. జవాబులను కమిషన్‌ అందజేసే బుక్‌లెట్‌లో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజినల్‌ ఫోటో ఐడి ఆధారంతో ఉదయం 8.45 నుంచి 9.30 గంటల మధ్య పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు.

15 నిమిషాలు అంటే 9.45 వరకు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. గ్రేస్‌ పీరియడ్‌ దాటిన తర్వాత ఎవ్వరినీ పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థుల వెంట ఎలకా్ట్రనిక్‌ వస్తువులను తీసుకురానీయరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments