Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళి కట్టిన అరగంటకే వరుడు పరార్

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:14 IST)
శ్రీకాకుళం జిల్లా దండులక్ష్మీపురం గ్రామానికి చెందిన మిరియాబిల్లి వెంకటేష్‌ అనే యువకుడు ఓ గ్రామానికి చెందిన యువతిని ఇష్టపడ్డాడు. ఆమె సైకిల్‌పై కళాశాలకు వెళ్తున్న సమయంలో వెంటపడే వాడు. ప్రేమించాలని ఒత్తిడి చేసే వాడు.
 
దీంతో ఆమె ప్రేమకు అంగీకరించింది. 2017 నుంచి మూడేళ్ల పాటు వీరి ప్రేమ సాగింది. వివాహం చేసుకోవాలని ప్రేయసి ఒత్తిడి చేయ డంతో ఈ దసరా సెలవుల్లో చేసుకుంటానని వెంకటేష్‌ నమ్మబలికాడు.

చివరకు నిన్న దండులక్ష్మీపురం శివారున గల అమ్మవారి ఆలయంలో ఆమెకు పసుపు తాడు కట్టాడు. కాళ్లకు మెట్టెలు సైతం తొడిగాడు.

అయితే, అరగంట తరువాత వెంకటేష్‌ బంధువులు వచ్చి పసుపు తాడు, మెట్టెలను తొలగించి ఎవరింటికి వారు వెళ్లిపోండని బెదిరించారని, దీంతో వెంకటేష్‌ తనను ఒంటరిగా వదిలేసి పరారయ్యాడని బాధితురాలు వాపోయింది.

దీనిపై ఉదయం తన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామపెద్దలతో కలిసి పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments