Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడికి పెళ్లి అయితే... బయటకు వెళ్లాల్సి వస్తుందనీ అలా చేశాడు...

తమ్ముడుకి పెళ్లి అయితే తాను బయటకు వెళ్లాల్సి వస్తుందని భావించాడో అన్న. దీంతో అన్న పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించాడు. ఇందుకోసం నాన్నమ్మను హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా క

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (09:27 IST)
తమ్ముడుకి పెళ్లి అయితే తాను బయటకు వెళ్లాల్సి వస్తుందని భావించాడో అన్న. దీంతో అన్న పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించాడు. ఇందుకోసం నాన్నమ్మను హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యాదాద్రి జిల్లా, మల్యాల గ్రామానికి చెందిన పురాణి పెద్దమ్మ (80) అనే వృద్ధురాలు ఉంది. పెద్దమ్మ రెండో కొడుకు లక్ష్మయ్య కూడా కీసర, నందినీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మయ్యకు ముగ్గురు కుమారులు. శ్రీకాంత్ (28), శ్రీధర్‌లకు పెండ్లి కాగా... శ్రీహరికి సంబంధాలు చూస్తున్నారు. అయితే, వీరి ఇల్లు చిన్నదిగా ఉంది. దీంతో శ్రీహరికి పెళ్లి అయితే శ్రీకాంత్ బయటకు వెళ్లాల్సి వస్తుందని భావించాడు. 
 
దీంతో తమ్ముడి పెళ్లిని ఎలాగైనా వాయిదా వేయాలని భావించాడు. ఇందుకోసం నాన్నమ్మను చంపాలని ప్లాన్ వేశాడు. ఇందులోభాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నానమ్మ ఉండే ఇంటికి వెళ్లాడు. వెంటనే శ్రీకాంత్ నాన్నమ్మ ముఖం మీద దిండుపెట్టి చంపాడు. ఈ హత్య తనమీదకు రాకుండా ఉండేందుకు నానమ్మ మీద ఉన్న బంగారాన్ని తీసుకెళ్లాడు. 
 
ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పెద్దమ్మ కుమార్తె నర్సమ్మ ఇంటికి వచ్చింది. మంచంపై తల్లి చనిపోయివుండటాన్ని గమనించింది. అదేసమయంలో శరీరంపై ఉన్న నగలు లేకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు. శ్రీకాంత్‌పై అనుమానంతో ఆదివారం సాయంత్రం నాచారంలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పెద్దమ్మను చంపింది తనేనని శ్రీకాంత్ అంగీకరించాడు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments