Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలులో ఉన్న చంద్రబాబుకు తక్షణం క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలి : ప్రభుత్వ వైద్యులు

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (11:21 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుడికంటికి తక్షణ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్య నిపుణులు నిర్ధారించారు. 
 
ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ బి.శ్రీనివాసరావు ఈ నెల 25వ తేదీన చంద్రబాబుని పరీక్షించి, జైలు అధికారులకు నివేదిక ఇచ్చారు. అందులో చంద్రబాబు కుడికంటిలో ఇమ్మెచ్యూర్ క్యాటరాక్ట్ ఉందని, దానికి శస్త్రచికిత్స చేయాలని నివేదించారు. చంద్రబాబుకు దృష్టి సమస్యను సరిదిద్దేందుకు కుడికంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయాలని హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులూ ఇటీవల ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. 
 
ఈ వైద్యులే చంద్రబాబుకు 2016లో 'యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి సమస్యకు లేజర్ చికిత్స, ఈ ఏడాది జూన్ 21న ఎడమ కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున మూడు నెలల్లోగా కుడికంటికీ శస్త్రచికిత్స చేయాలని అప్పుడే తెలిపారు. ఇటీవల ఇచ్చిన నివేదికలోనూ వారు అదే విషయాన్ని మళ్లీ ధ్రువీకరించారు. అయితే, జైలులో చంద్రబాబు ఉండటం, ఆయన ఆరోగ్యం పట్ల ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో బాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments