Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగులకు ప్రభుత్వం అండ.. మంత్రి వనిత

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (08:36 IST)
దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండాలని నిర్ణయించిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ  మంత్రి తానేటి వనిత వెల్లడించారు. వికలాంగులకు పెన్షన్లను ఇబ్బందులు లేకుండా పంపిణీ కి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

దివ్యాంగులకు మధ్యాహ్నం భోజనం పాఠశాలల్లో సమర్ధవంతంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వికలాంగులకు స్వయం సమృద్ధి కలిగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. వృద్దులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు.

గ్రామ వాలంటీర్ల ద్వారా వృద్దుల పథకాలు అమలు చేస్తామని తెలిపారు. జిల్లాకి ఒక వృద్దాశ్రమాన్ని భవిష్యత్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందడం లేదని తెలిపారు. పిల్లలకు ఇచ్చే ఆహారం కూడా సక్రమంగా చేరడం లేదన్నారు.

దానిని పూర్తిగా సంస్కరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి తెలిపారు. 53 శాతం రాష్ట్రంలో ఎనిమియా (రక్తహీనత) ఉందని నీటి ఆయోగ్ చెప్పిందని గుర్తుచేశారు. దానిని తగ్గించేందుకు కృషి చేస్తామని, త్వరలో మంచి విధానాన్ని తీసుకోస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments