Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ : టీటీడీ చైర్మన్

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (10:03 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా టీటీడీ దేవాదాయశాఖతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమాలు నిర్వహిస్తుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
 
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు లోని సిద్దార్ధ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో వెంకట్రావ్ సంక్రాంతి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమానికి  వెంకట్రావ్ గోవును దానం చేశారు.
 
ఈ సందర్భంగా జరిగిన సభలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడారు. గోవును పూజించే ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని ఆయన చెప్పారు.

గోవు ముక్కోటి దేవతలతో సమానమని, అందుకే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ దేశ వ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. డిసిసి బ్యాంక్ చైర్మన్ వెంకట్రావ్ టీటీడీకి గోవును దానం చేయడం సంతోషమన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments