Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణమిచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఎక్కడ?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమసంబంధాలు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భార్యను, ఆమెతో కలిసున్న ఓ వ్యాపారిని రెడ్

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (13:11 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమసంబంధాలు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భార్యను, ఆమెతో కలిసున్న ఓ వ్యాపారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు ఓ భర్త. అంతటితో ఆగకుండా దాడికి దిగాడు. 
 
వివరాల్లోకి వెళితే... వెంకటేశ్వరరావు, శ్రీదేవి భార్యాభర్తలు. అదే ప్రాంతంలో కలప వ్యాపారం చేసుకునే రామకృష్ణరాజు వద్ద వెంకటేశ్వరరావు రెండు లక్షల రూపాయల రుణం చేశాడు. ఈ రుణం తిరిగి చెల్లించాలని వెంకటేశ్వరరావు ఇంటి వద్దకు వచ్చి అడిగి వెళుతున్న సమయంలో శ్రీదేవితో పరిచయం పెరిగింది. వారిద్దరి మధ్యా వివాహేతర బంధం నడిచింది. 
 
ఈ విషయాన్ని తెలుసుకున్న వెంకటేశ్వరరావు, పలుమార్లు భార్యను మందలించాడు. కానీ ఆమె పద్ధతి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో తన భార్య రామకృష్ణతో కలసి వెళ్లిందని తెలుసుకున్న వెంకటేశ్వరరావు, స్నేహితులతో కలసి చింతలపూడి రోడ్డుపై కాపుకాసి, వారు కారులో వస్తుండగా అడ్డగించాడు. 
 
ఎక్కడి నుంచి వస్తున్నారంటూ నిలదీసి కారును ధ్వంసం చేసి, వారిపై దాడి చేశాడు. ఆపై వారిద్దరి మీదా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, తన భర్త ఎంతో మంది వద్ద రుణాలు తీసుకున్నాడని, వారందరితోనూ తనకు అక్రమ సంబంధం అంటగడుతున్నాడని శ్రీదేవి ఆరోపించింది. రామకృష్ణ తనకు లిఫ్టు ఇచ్చాడంటూ.. భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments