Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో ఏకాంతానికి అడ్డుగా వుందని... పసిప్రాణం తీశాడు!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (14:36 IST)
భార్యతో ఏకాంతానికి అడ్డుగా ఉందని సొంతబాబాయే ఓ పసిపాప ప్రాణం తీశాడు. ఈ ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది. ఒంగోలులో జరిగిన బేబీ మర్డర్ కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. పిన్ని పిన్ని అంటూ భార్యతో చనువుగా ఉంటూ.. శృంగారానికి అడ్డుగా ఉందని బాబాయే చిన్నారి ఆరాధ్యను కడతేర్చాడు. 
 
కొత్తగా వివాహమైనప్పటికీ తన భార్యతో ఏకాంతంగా గడపలేక పోతున్నానన్న అక్కసుతో తమకు అడ్డుగా ఉన్న అభంశుభం తెలియని ఓ చిన్నారిని సొంత బాబాయే అతి కిరాతకంగా హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఆ తర్వాత పొలంలో పాతిపెట్టిన ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
ఒంగోలులోని రాజా పానగల్ రోడ్డులో ఉన్న శ్రీధర్‌, సాహితి దంపతులకు ఆరాధ్య అనే చిన్నారి ఉంది. ఎంతో అల్లారుముద్దుగా ఉండే ఈ చిన్నారి.. ఎక్కువగా పిన్ని సింధూ వద్దే ఉండేది. రెండు రోజుల క్రితం ఈ చిన్నారి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇదిలావుండగా, సింధూతో చిన్నారి బాబాయి లక్ష్మీ నారాయణకు ఇటీవల వివాహమైంది. అయితే, ఆరాధ్య ఎక్కువగా పిన్ని దగ్గరే ఉండటంతో తాను తన భార్యతో సన్నిహితంగా గడపటానికి అవకాశం ఉండట్లేదనే కోపంతో ఆరాధ్య అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఆ ప్రకారంగా ఇంటి బయట ఆడుకుంటున్న ఆరాధ్యను బైక్‌పై ఊరి బయట పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చి, ఇతరులతో కలిసి ఆరాధ్య కోసం గాలించసాగాడు. 
 
అయితే, పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు.. లక్ష్మీనారాయణ చంపేసినట్లు తమ విచారణలో కనుగొన్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా నిజం వెల్లడించాడు. ఆ తర్వాత మంగళవారం అర్థరాత్రి చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన ఒంగోలు పోలీసులు, నిందితుడు లక్ష్మీనారాయణను అరెస్ట్‌ చేశారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments