గజల్ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్: పార్వతికి కూడా ముందస్తు బెయిల్

ప్రముఖ గజల్ కళాకారుడిగా గుర్తింపు సంపాదించిన గజల్ శ్రీనివాస్ చీకటి కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గజల్ శ్రీనివాస్ రాసలీలల వీడియోలు లీక్ కావడంతో కొత్త సంవత్సరం పుట్టిన రెండో రోజు (జనవరి 2) అతన

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (15:02 IST)
ప్రముఖ గజల్ కళాకారుడిగా గుర్తింపు సంపాదించిన గజల్ శ్రీనివాస్ చీకటి కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గజల్ శ్రీనివాస్ రాసలీలల వీడియోలు లీక్ కావడంతో కొత్త సంవత్సరం పుట్టిన రెండో రోజు (జనవరి 2) అతనిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. 
 
''సేవ్‌ టెంపుల్స్'' అనే గజల్ శ్రీనివాస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని ఆరోపణలతో చేయడంతో పాటు తగిన ఆధారాలతో కూడిన వీడియోలను పోలీసులకు అప్పగించింది. ఇంకా  పోలీసుల చేతుల్లోని గజల్‌ వీడియోలు కొన్ని లీక్‌ కావడం సంచలనంగా మారింది.
 
కాగా.. గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇదే కేసులో ఏ2 నిందితురాలు పార్వతికి కూడా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంతేగాకుండా రూ.10వేల నగదును ఇద్దరూ పూచీకత్తుగా చెల్లించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్ కారణంగా త్వరలో గజల్ శ్రీనివాస్ విడుదల కానున్నాడు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

Riya Singha: జెట్లీ నుంచి మిస్ యూనివర్స్ రియా సింఘా ఫస్ట్ లుక్ రిలీజ్

జై బాలయ్య అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సఃకుటుంబానాం

Jin: వైవిధ్యభరితమైన కథతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జిన్

బిగ్ బాస్‌కు వెళ్ళడంతో కెరీర్ కోల్పోయాను : కరాటే కళ్యాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం