Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు గవర్నర్ గట్టి షాకే ఇచ్చారా? చక్రపాణి పేరుకు ఓకే..!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (10:59 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మరోమారు షాకిచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకవర్గం నియామకం విషయంలో ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో నాలుగింటికి ఓకే చెప్పిన గవర్నర్ ఐదు పేర్లను తిరస్కరించారు. దీంతో కేసీఆర్‌కు గవర్నర్ గట్టి షాకే ఇచ్చినట్లైంది. 
 
చైర్మన్‌గా ప్రభుత్వం ప్రతిపాదించిన ఘంటా చక్రపాణి పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గవర్నర్ సభ్యులుగా విఠల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీల పేర్లకూ పచ్చజెండా ఊపారు. అయితే, కేసీఆర్ ప్రతిపాదించిన రంగారావు, చంద్రశేఖరరెడ్డి, దినేశ్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్‌ల పేర్లను గవర్నర్ తిరస్కరించారు. 
 
పూర్తి స్థాయి కార్యవర్గంతో కమిషన్ ను ఏర్పాటు చేద్దామని భావించిన కేసీఆర్, ఊహించని విధంగా గవర్నర్ నుంచి షాక్ చవిచూశారు. అయితే, వెనువెంటనే తేరుకున్న ఆయన చైర్మన్, ముగ్గురు సభ్యులతోనే పాలకవర్గం కొలువుదీరేందుకు పచ్చజెండా ఊపారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments