Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ రక్షణ కోసం రాజశ్యామల అనుగ్రహం పొందండి: స్వాత్మానందేంద్ర స్వామి

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:20 IST)
దేశ రక్షణ కోసం జగన్మాత రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని రక్షణ శాఖ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్ డీఓ) ఛైర్మన్ సతీష్ రెడ్డికి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సూచించారు.

పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు రాజశ్యామల అమ్మవారికి పూజలు చేసి సత్ఫలితాలను సాధించేవారని తెలిపారు. లోకాలను పాలించే రాజమాతంగిగా అమ్మవారు పూజలందుకుంటున్నారని వివరించారు. ఈరోజు ఢిల్లీలో స్వాత్మానందేంద్ర స్వామి డీఆర్ డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆశీస్సులు అందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేశంతో పాటు దేశ ప్రజల రక్షణకు సైతం డీఆర్ డీఓ కట్టుబడి ఉందన్నారు. కరోనా ఆపత్కాలంలో ఇమ్యూనిటీ పెంచే 2 - డీ పౌడరును తయారు చేసామని, దేశవ్యాప్తంగా వేయి(1000) ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

ఇప్పటికే పదివేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసి సేవలందించామని స్వామీజీకి వివరించారు. తన హయాంలో రాడార్, క్షిపణి వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాజశ్యామల అనుగ్రహంతో మరింత పటిష్టంగా రక్షణ శాఖను తీర్చిదిద్దాలని ఛైర్మన్ సతీష్ రెడ్డికి స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments