Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట్లు ఖర్చు పెడుతున్నా కనీస వసతులు లేకుంటే ఎలాగండీ? గంటా ఫైర్

అమరావతి: కోట్లు ఖర్చు పెడుతున్నా కనీస మౌలిక సదుపాయాలైన ఫ్యాన్లు, తాగునీరు, లైటింగ్, యూనిఫాం, టాయలెట్లకు రన్నింగ్ వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు ఇంకా కొన్ని కేజీబీవీలు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో లేనట్లు వార్తలు వస్తున్నాయని, వీటిని వెంటనే సరిచేసుకోవాలని మంత

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (21:34 IST)
అమరావతి: కోట్లు ఖర్చు పెడుతున్నా కనీస మౌలిక సదుపాయాలైన ఫ్యాన్లు, తాగునీరు, లైటింగ్, యూనిఫాం, టాయలెట్లకు రన్నింగ్ వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు ఇంకా కొన్ని కేజీబీవీలు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో లేనట్లు వార్తలు వస్తున్నాయని, వీటిని వెంటనే సరిచేసుకోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కనీస మౌలిక సదుపాయాలకు నిధులు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తున్నా ఇంకా లోపాలు వుంటున్నాయని, వెంటనే ఎక్కడా అలాంటి సమస్య రానివ్వద్దని సర్వశిక్షా అభియాన్ పిఓలకు మంత్రి గంటా సూచించారు. 
 
తనిఖీలు చేసి మౌలిక సదుపాయాల కొరత వుంటే పరిష్కరించాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బుధవారం ఆయన సచివాలయంలోని తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్.ఎస్.ఏ పిఓలతో సమీక్షించారు. విద్యాసంస్థలు ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్నా ఇంకా లోటుపాట్లు వుంటున్నాయని వీటిని సరిచేసుకొనే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల కోసం యాన్యుటి ప్రతిపాదికన రూ.4,848 కోట్లు ఖర్చు చేయనున్నామని, ప్రహరీ గోడలు, భవన నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులు వెచ్చిస్తామన్నారు. 
 
క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేస్తేనే ఫలితాలు వుంటాయని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని మంత్రి గంటా సూచించారు. మధ్యాహ్నా భోజనం కొన్నిచోట్ల నాణ్యత లేకుండా వుందని, తన తనిఖీల్లోనూ ఇది వెల్లడైందన్నారు. తనిఖీలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చేర్యలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమగోదావరి, ఒంగోలుతో పాటు పలు జిల్లాల పిఓలు తమ కేజీబీవీ విద్యార్థులు వివిధ జాతీయ స్థాయి పోటీల్లో నెగ్గారని మంత్రికి తెలిపారు. ప్రతిభ చూపిన వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, నవంబర్ 14న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమీక్షలో నిర్ణయించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ట్యాబ్‌లు అందివ్వాలని మంత్రి గంటా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో( కేజీబీవీ) ఇంటర్ విద్యను ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.   ఈ ఏడాది నుంచే ప్రవేశాలు పొందవచ్చన్నారు. కేబీబీవీల్లో నాణ్యమైన భోజనం పెట్టాలని, మెనూ తప్పనిసరిగా అనుసరించాలన్నారు. పిల్లలు చదువుతోపాటు ఫిజికల్ లిటరసీపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని మంత్రి గంటా సూచించారు. 
 
ప్రతి కేజీబీవీకి 5 కంప్యూటర్లు అందజేస్తున్నామని, వీటి ద్వారా కంప్యూటర్ విద్యను విద్యార్థునులకు అందించాలన్నారు. ఆర్. ఓ. ప్లాంట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో 3 స్థానం ఏపీ ఎస్.ఎస్.ఏకి రావడం పట్ల మంత్రి గంటా- పిఓలకు అభినందనలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కూడా జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో వారిని అభినందించారు. 10 లోపు స్కూళ్లు పాడైన భవంతుల్లో నడుస్తున్నాయని గుంటూరు పిఓ తెలపగా... వెంటనే వాటిని ఖాళీ చేయించి ప్రత్యామ్నాయ భవనాల్లో విద్యనందించాలని మంత్రి గంటా స్పష్టం చేశారు.

అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, ఎలాంటి చిన్న సమస్య వచ్చినా తన దృష్టి కి తీసుకురావాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా పనిచేయాలంటే మరింత కష్టపడాలని, రాష్ట్ర విద్యారంగాన్ని నాలెడ్జ్ స్టేట్ -ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాల్సిన బాధ్యత మనందరిపై నే వుందని మంత్రి గంటా స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎస్.ఎస్.ఏ ఎస్పీడీ జి.శ్రీనివాసులుతో పాటు ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ప్రోగ్రామ్ అధికారులు  పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments