Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్.. ఓ సీఎంగా వ్యవహరించడం లేదు.. : ఏపీ మంత్రి గంటా

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (20:05 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఒక సీఎంగా వ్యవహరించడం లేదని, ఇంకా ఉద్యమనేతగానే ప్రవర్తిస్తున్నారని ఏపీ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపి ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఎస్‌బిహెచ్ ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపజేసిందని అన్నారు.
 
అంశంపై కోర్టును ఆశ్రయించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితోపాటు బ్యాంకు వ్యవహార శైలిపై అక్కడే తేల్చుకుంటామని మంత్రి గంటా హెచ్చరించారు. తమ శాఖ నిర్వహిస్తున్న ఖాతాను ఫ్రీజ్ చేసిన ఎస్‌బిహెచ్‌పై పరువు నష్టం దావా కూడా వేస్తామన్నారు.
 
ఇకపోతే ఫాస్ట్ పథకం అమలుపై తెలంగాణ సర్కారుకు కోర్టు చెంప పెట్టులా మారినా వారి వైఖరిలో మార్పు రాకపోవడం దురదృష్టకరమని గంటా అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఉద్యమకారుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments