Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల విలువ రూ.500 కోట్లు?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల లెక్క తేల్చారు. ఈ ఆస్తుల విలువ తెలుస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. నయీంతో పాటు.. తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో ఏకంగ

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (08:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల లెక్క తేల్చారు. ఈ ఆస్తుల విలువ తెలుస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. నయీంతో పాటు.. తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో ఏకంగా 1015 ఎకరాలు ఉన్నట్లు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
 
నయీం రాజధాని చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు జిల్లా కేంద్రాల్లో 1,67,000 గజాల ఇళ్ల స్థలాలను తన పరం చేసుకున్నారు. నయీం అక్రమాస్తుల విలువ రూ.500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనాకు వచ్చారు. ఆక్రమించుకున్న ఆస్తులను బాధితులకు అప్పగించే అంశంపై ఆలోచన చేస్తున్నారు.
 
పైగా, ఈ అక్రమాస్తులను చట్టబద్ధం చేసుకునేందుకు కూడా నయీం అధికారులతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. పలు ఆస్తులను చట్టబద్ధంగా తన పేరుతోనే, అనుచరులు, బంధువుల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయించాడు. 
 
ఒకసారి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తేకే అన్ని హక్కులూ లభిస్తాయి. బెదిరింపులతో ఆస్తులు కూడపెట్టుకున్నా.. అన్ని ఆస్తులను సంపాదించే శక్తి నయూంకు లేదన్న కారణాలతో అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments