Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరంలో కీచక పర్వం : టెన్త్ బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య

విజయనగరం జిల్లాలో కీచక పర్వం జరిగింది. ఓ పదో తరగతి చదివే బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం... విజయ నగరం జిల్లా గాదెలవలసలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (08:57 IST)
విజయనగరం జిల్లాలో కీచక పర్వం జరిగింది. ఓ పదో తరగతి చదివే బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం... విజయ నగరం జిల్లా గాదెలవలసలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన మిరియాల ఇందు సీతానగరం మండలంలోని గాదెలవలసలో టెన్త్ క్లాస్ చదువుతోంది. గత శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్నం భోజనం చేసేందుకు సైకిల్‌పై ఇంటికివెళ్లింది. తిరిగి పాఠశాలకు వస్తుండగా మార్గంమధ్యలో గాదెలవలసలోని వైన్‌షాపు సమీపంలో పోతల శంకరరావు ఆమెను అడ్డుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆమె వెనుకనే వచ్చి.. గాదెలవలస, బడేవలస మధ్యన ఉన్న మామిడితోటలోకి బలవంతంగా లాక్కెళ్ళాడు. అక్కడకు తన స్నేహితులు సొంగల లోకేశ్, చుక్క రాంబాబు, కోదేటి రవితేజలను పిలిపించి, వారంతా కలసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటకు ఎక్కడ చెబుతుందోనని గొంతునులిమి హత్యచేసి.. మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయారు. స్కూల్‌ నుంచి కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి గాదెలవలస వచ్చి విచారించారు. 
 
ఇందుతో శంకరరావు మధ్యాహ్నం మాట్లాడినట్లు, ఇందును బెదిరించినట్లు ప్రత్యక్ష సాక్షి పి.అచ్చుత్ వారికి తెలిపారు. గ్రామ పెద్దలతో కలసి శంకరరావును నిలదీయగా.. జరిగిన విషయాన్ని శంకరరావు పెద్దల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇందు మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి తరలించారు. కేసు నమోదు చేసి నలుగురు కామాందులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments