Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో శవాల మాయం.. డెడ్ బాడీ మార్పు.. చెక్ చేసుకుని ఖననం..!

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (10:06 IST)
గాంధీ ఆస్పత్రిలో శవాల అప్పగింతకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. గతంలో లాలాపేటకు చెందిన బహదూర్ అనే నేపాలీ దేశస్థుడు నడుస్తూ నడ స్తూనే కుప్పకూలి చనిపోయాడు. టెస్ట్ చేయగా కరోనా అని తేలింది. అతడి శవం ఏమైందో కూడా ఇప్పటికీ తెలియదు. ఆ తర్వాత వనస్థలి పురానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి కరోనాతో చనిపోయాడు. 
 
డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా, కనీసం సమాచారమూ ఇవ్వకుండా దహనం చేశారు. దీనిపై అతడి భార్య హైకోర్టును ఆశ్రయించగా ఎంత వివాదం రేగిందో తెలిసిందే. రెండు రోజుల క్రితం బేగంపేట గురుమూర్తి నగర్ కు చెందిన ఓ వ్యక్తి చనిపోగా, వేరే శవాన్నివారి కుటుంబసభ్యులకు ఇచ్చారు. తీరా శ్మశానవాటికకు వెళ్లిన తర్వాత గానీ వేరే వ్యక్తి డెడ్ బాడీ అని గుర్తించలేకపోయారు అతడి భార్య, కొడుకు. ఆ శవాన్ని తిరిగి గాంధీకి తీసుకొచ్చి అసలు శవాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నాలుగోసారి ఇప్పుడు మరో ఘటన జరిగింది.
 
ఒక కుటుంబానికి ఇవ్వాల్సిన డెడ్ బాడీని మరో కుటుంబానికి అప్పగించి గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం చూపించారు. పహాడీషరిఫ్‌కు చెందిన మహబూబ్ అనే వ్యక్తి, నాంపల్లికి చెందిన రషీద్ అలీఖాన్ అనే వ్యక్తి బుధవారం గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చనిపోయారు. మహబూబ్ కుటుంబ సభ్యులకు రషీద్ బాడీని గాంధీ సిబ్బంది అప్పగించారు. అయితే, డెడ్ బాడీని చెక్ చేసుకొని కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ఖననం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments