Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు హీరోగా వేషం వేస్తే.. హీరోయిన్ ఎవరో తెలుసా? : ఫ్రెండ్ చెప్పిన ఆసక్తికర విషయం!

ఆగస్టు 7వ తేది. స్నేహితుల దినోత్సవం. ఈరోజున ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గత 55 యేళ్లుగా మిత్రుడిగా ఉన్న వ్యక్తి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (11:05 IST)
ఆగస్టు 7వ తేది. స్నేహితుల దినోత్సవం. ఈరోజున ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గత 55 యేళ్లుగా మిత్రుడిగా ఉన్న వ్యక్తి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన పేరు గిరిధర్ రెడ్డి. తిరుపతి సమీపంలోని తొండివాడలో నివసిస్తున్నారు. వీరిద్దరు చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పటినుంచి వీరు స్నేహం కొనసాగుతూ వస్తోంది. ఇంటర్, డిగ్రీలోనూ వీరు కలిసి చదువుకున్నారు. ఇద్దరు కలిసి, మెలిసి తిరిగారు. గత 55 యేళ్లుగా వీరిద్దరు వీరిద్దరు స్నేహితులు. 
 
స్నేహితుల దినోత్సవం రోజున చంద్రబాబు గురించి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవారు. చంద్రబాబు హీరో వేషం వేస్తే, ప్రస్తుత చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హీరోయిన్ వేషం వేసేవారని చెప్పారు. ఆ రోజుల్లో చంద్రబాబు సేద్యం చేసేవాడని, నాగలి కూడా దున్నేవాడని, వాళ్ల నాన్నకు సహాయ సహకారాలు అందించేవాడని తెలిపారు. చిన్నప్పటి నుంచి పని రాక్షసుడని, వినాయక యువజన సంఘం ఏర్పాటు చేసి అందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి అందరిచేత శ్రమధానం చేయించేవారని గిరిధర్ రెడ్డి పాత జ్ణాపకాలను నెమరేసుకున్నారు. 
 
చిన్నప్పటినుంచే చంద్రబాబులో నాయకత్వ లక్షణాలు కనిపించాయని, కానీ సీఎం అవుతాడని ఊహించలేదని అంటున్నాడు. చంద్రబాబుకు మిత్రుడిగా ఉండటం తన అదృష్టమని, ఆయనే తన హీరో అంటున్నారు గిరిధర్. నారావారి పల్లెకు వెళ్లినప్పుడు గిరిధర్‌ను చంద్రబాబు తప్పక కలుస్తారట. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments