Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది..

ఠాగూర్
శుక్రవారం, 23 మే 2025 (08:41 IST)
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చైనా, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. భారత్‌లో కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓ కరోనా కేసు నమోదైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 257 కరోనా కేసులు నమోదైవున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
విశాఖపట్టణం నగరంలోని మద్దిలపాలెంకు చెందిన 23 యేళ్ల యువతి కార్పొరేట్ ఆస్పత్రిలో 4 రోజుల క్రితం జ్వరంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్‌లోని వైరాలాజీ ప్రయోగశాలలో పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. 
 
అయితే, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నందున గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అలాగే, ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలకు జిల్లా అధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments