Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో భారీ వర్షం: మట్టిపెళ్లలు, గోడ విరిగిపడి నలుగురు మృతి!

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (16:53 IST)
విశాఖ నగరంలో కురిసిన భారీ వర్షం నలుగురు వలస కార్మికుల దుర్మరణానికి కారణమైంది. ఈ వర్షానికి తడిసిన ఓ ప్రహారీ గోడ కూలడంతో పాటు మట్టి పెళ్లలు విరిగిపడటంతో దాని పక్కనే పని చేస్తున్న ఆరుగురు కూలీలు మట్టి పెళ్లల కింద చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నంలోని సిరిపురం టైకూన్ హోటల్ సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఓ భవన ప్రహారీ గోడ కూలింది. గోడతో పాటు భారీగా మట్టి పెళ్లలు కూలాయి. శిథిలాల కింద పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నలుగురు మృతులను బయటికి తీశారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 
 
10 అడుగుల లోతు ఉన్న గుంతలో ఆరుగురు కార్మికులు పని చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ప్రహారీగోడ, దాని కింద ఉన్న మట్టిపెళ్లలు కుప్పకూలిపోయాయి. వీటి కింద చిక్కుకున్న నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మృతులను కృష్ణ, రాము, పరదేశ్, సోమేష్‌లుగా గుర్తించారు. అపార్ట్‌మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహారీ గోడకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

Show comments