Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాపై పోటీ చేస్తా.. వాణివిశ్వనాథ్ ప్రకటన: గాలికి చిర్రెత్తుకొచ్చింది.. బాబు టికెట్ ఇస్తారా?

ప్రముఖ సినీ నటి వాణివిశ్వనాథ్ రాజకీయాల్లో అడుగెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తెలుగు సినీ ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నా

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (09:45 IST)
ప్రముఖ సినీ నటి వాణివిశ్వనాథ్ రాజకీయాల్లో అడుగెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తెలుగు సినీ ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే తనకు ఎంతో ఇష్టమని.. రాజకీయాల్లో ఆయన ఓ రోల్ మోడల్ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చేఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ వస్తే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీ చేస్తానని ప్రకటించారు. 
 
కాగా ఈ మధ్య చిత్తూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఆమెను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు త్వరలోనే ఆమె తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. అమరావతి వేదికగా త్వరలోనే చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 
 
కాగా చిత్తూరు నుంచి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయనే ఇంఛార్జ్‌గా వున్నారు. అలాంటి తరుణంలో పార్టీలో చేరకముందే వాణి విశ్వనాథ్ నగరి నుంచి పోటీ చేస్తాననడం గాలికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

ఆమె ఇష్టానుసారంగా తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంపై గాలి ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. మరి వాణికి నగరి టికెట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తారా? అనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments