ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

ఠాగూర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (16:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తర్వాత శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. 
 
ఈ సందర్భంగా ఇసుక గుత్తేదారు సంస్థలైన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ లాయర్లు న్యాయస్థానానికి వివరించారు. ఆయన చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2,566 కోట్ల మేర నష్టం వచ్చిందన్నారు. వెంకటరెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు.
 
మరోవైపు వెంకట రెడ్డి తరపు న్యాయవాది రిమాండు విధించవద్దని వాదించారు. ఇరువైపుల వాదనలు ఆలకించిన ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు.. వెంకటరెడ్డికి వచ్చే నెల 10వ తేదీ వరకూ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో అధికారులు ఆయన్ను విజయవాడ కారాగారానికి తరలించారు. ఇక వెంకటరెడ్డిని కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments