Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు టైరు పేలి మాజీ ఎమ్మెల్యే దుర్మణం

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (19:18 IST)
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కారు టైరు పేలపోవడంతో కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. హైదారాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా మార్గమధ్యంలో టైరు పేలిపోయింది. దీంతో కారు బోల్తాపడింది. ఈ ఘటన బీచుపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం ధాటికి ఆమె ప్రయాణిస్తున్న ఫార్చూనర్ వాహనం పల్టీ కొట్టి నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలపాలైన నీరజారెడ్డిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ఆమె తల, ఇతర శరీర భాగాలకు తీవ్రమైన దెబ్బలు తగలడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
నీరజారెడ్డి ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రెండేళ్లకే ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీని కూడా వీడి వైకాపాలో చేరారు. అక్కడ ఇమడలేక భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. ఈమె భర్త పాటిల్ శేషిరెడ్డి గతంలోనే మరణించారు. ఆయన పత్తికొండ ఎమ్మెల్యేగా పని చేశారు. నీరజారెడ్డి మృతిపట్ల బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. కతో సక్సెస్‌.. దిల్‌రుబాతో రెడీ

నరేష్‌లో 10 మందికి ఉండే ఎనర్జీ ఉంది.. రాత్రి అయితే తట్టుకోలేకపోతున్నా... : నటి పవిత్ర లోకేశ్ (Video)

నిర్మాత దిల్ రాజు నివాసాల్లో ఐటీ మెరుపుదాడులు

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments