Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి గల్ఫ్ విమాన సర్వీసులు పున:ప్రారంభం

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడ గన్నవరం నుంచి గల్ఫ్ దేశాలకు విమాన సేవలు పునఃప్రారంభమయ్యాయి. విజయవాడకు విదేశీ విమాన సర్వీసులు మస్కట్, సింగపూర్, కువైట్ తదితర దేశాల నుంచి విమానాలు వచ్చేందుకు అనుమతించారు. 
 
బుధవారం సాయంత్రం 6.10 గంటలకు 65 మందితో దుబాయ్ విమానం ఇక్కడికి చేరుకోనుంది. విజయవాడకు ఒక్క ఆదివారం మినహాయించి వారానికి 10 విదేశీ విమాన సర్వీసులు రానున్నాయి. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 3 నుంచి విదేశీ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
 
వందే భారత్ మిషన్‌లో భాగంగా రానున్న విదేశీ విమాన సర్వీసుల కోసం గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశీ విమాన సర్వీసులు అక్టోబరు వరకు కొనసాగనున్నాయి. 18 దేశాల నుంచి ఇప్పటిదాకా 56,038 మంది ప్రవాసులు ఏపీకి చేరుకున్నారు. వీరిలో కువైట్ నుంచి రాష్ట్రానికి వచ్చినవారే 29,356 మంది ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments