Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (09:56 IST)
విద్యార్థులు కొందరు కలుషిత ఆహారం తీసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు. చెడిపోయాన పప్పు ఆహారం తీసుకోవడంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలు అయి ఆసుపత్రి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోతవరం గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ వసతిగృహంలో కలుషితాహారం వల్ల 30 మంది విద్యార్థులు గురువారం భోజనం చేశారు. భోజనంలోకి పప్పు, క్యాబేజీ, కోడిగడ్డు వడ్డించారు. అయితే అవి అప్పటికే కలుషితమయ్యాయి. దీంతో కొంత మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో తల్లడిల్లి పోయారు.
 
హాస్టల్‌లో ఉన్న 60 మంది విద్యార్థుల్లో కొందరు కడుపునొప్పితో బాధపడగా, మరికొందరు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం 28 మందిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాడైన కోడిగుడ్లు వండడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ విద్యార్థులను పరామర్శించారు.
 

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments