Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర గద్దర్ ఇకలేరు

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (08:51 IST)
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఇకలేరు. "ఏం పిల్లడో ఎల్దమొస్తవా.." అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు. విజయనగరం జిల్లా పెదబొండపల్లికి చెందిన వంగపండు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 
 
1943లో జ‌న్మించిన వంగ‌పండు ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుగాంచారు. 1972లో  జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో గిరిజనులను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయనకు 2017లో కళారత్న పురస్కారం లభించింది. 
 
వంగపండు మృతి విషయం తెలిసిన వెంటనే విప్లవకవి గద్దర్ స్పందించారు. ఆయనది పాట కాదని, అది ప్రజల గుండె చప్పుడు అని కొనియాడారు. అక్షరం ఉన్నంత వరకు ఆయన జీవించి ఉంటారని అన్నారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వంగపండు అని ప్రశంసించారు.
 
త‌న జీవిత కాలంలో వంద‌ల పాట‌ల‌కు ఆయ‌న గ‌జ్జెక‌ట్టారు. 1972లో జ‌న‌నాట్య మండ‌లిని స్థాపించిన వంగ‌పండు త‌న గేయాల‌తో బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌ను, గిరిజ‌నుల‌ను చైత‌న్య ప‌రిచారు. 2017లో క‌ళార‌త్న పుర‌స్కారాన్ని అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments