Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా నదిని కబ్జారాయుళ్ల నుంచి కాపాడండి.. మత్యకారుల వినూత్న ధర్నా

భూమిని కబ్జా చేస్తారు. కొండల్ని, పర్వతాలను కబ్జా చేస్తారు, అడవులను కబ్జా చేస్తారు. ఇవన్నీ మనకు తెలిసినవే. కాని చరిత్రలో మొదటి సారిగా ఒక నదీ గర్భాన్నే కబ్జా చేసిన ఘటన కనీవినీ ఎరుగనిది. ఆంధ్రప్రదేశ్ ఈ వ

Webdunia
సోమవారం, 1 మే 2017 (07:23 IST)
భూమిని కబ్జా చేస్తారు. కొండల్ని, పర్వతాలను కబ్జా చేస్తారు, అడవులను కబ్జా చేస్తారు. ఇవన్నీ మనకు తెలిసినవే. కాని చరిత్రలో మొదటి సారిగా ఒక నదీ గర్భాన్నే కబ్జా చేసిన ఘటన కనీవినీ ఎరుగనిది. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలోనూ నంబర్ వన్‌గా నిలుస్తోందా..అంటే నిజమే అనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు నేరుగా కృష్ణా నదీ గర్భాన్నే కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో మత్స్యకారులు నిప్పులు చెరిగారు. నది జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఆదివారం సుమారు 250 బోట్లలో వారు నదిలో కలియదిరుగుతూ మూడు గంటల పాటు వినూత్న రీతిలో మహాధర్నా చేపట్టారు. 
 
కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో విస్తరించిన కృష్ణా నది గర్భాన్ని ప్రభుత్వ పెద్దలు కొందరు ఆక్రమించుకున్నారు. ఐరన్‌ రోప్‌లను నదిలోపల కంచెగా ఏర్పాటు చేసి వాటిపై ప్లాస్టిక్‌ డబ్బాలు, ఎర్రజెండాలు పాతి కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. మీడియాలో ఈ విషయం బయటపడగానే వివిధ పర్యావరణ నిపుణులు తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే ఒక నదీ గర్భాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి అని, అధికార పార్టీ నాయకలు అండతో జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని తుదికంటా అడ్డుకుంటామని, మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించారు
 
తుమ్మల పాలెం, గుంటుపల్లి, తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం మధ్యలో కృష్ణానది గర్భంలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణం మేర ‘పెద్దలు’ కబ్జా చేయడంపై మత్స్యకారులు తీవ్రంగా స్పందించారు. తుమ్మలపాలేనికి చెందిన మత్స్యకారులు ఆదివారం ఉదయం 9కి బోట్లలో కృష్ణానది ఆక్రమిత ప్రాంతా నికి చేరుకున్నారు. గుంటుపల్లి, తాళ్లాయపాలెం, ఉద్దండ్రా యునిపాలెం పరిధిలోని మత్స్యకారులూ అక్కడికి వచ్చారు. సుమారు 250 బోట్లలో 500 మందికిపైగా మత్స్యకారులు నదిలో ఆక్రమిత ప్రాంతం చుట్టూ తిరుగుతూ... ‘కృష్ణా నదిని కబ్జారాయుళ్ల నుంచి కాపాడండి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 
 
కబ్జాకు పాల్పడిన పెద్దలపై విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరి కొందరు బోట్లపై అర్ధనగ్నంగా నిల్చొని.. నదినే నమ్ముకుని బతుకుతున్న తమ పొట్టకొట్టొద్దంటూ రెండు చేతులెత్తి నమస్కరించారు. కబ్జా ప్రయత్నాన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. నదిలో ఏర్పాటు చేసిన భారీ ఐరన్‌ రోప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తామే తొలగించాల్సి ఉంటుందని ప్రభుత్వ పెద్దలు, అధికారులను హెచ్చరించారు. 
 
కృష్ణా నదిని ఆక్రమించి పూడ్చేందుకు కేరళ, కర్ణాటక, చెన్నై నుంచి పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చారు. ఈ విషయమై మీడియాలో వార్త రావడంతో వాటిని నది లోపలికి తీసుకెళ్లలేదు. లేదంటే ఈ పాటికే పనులు ప్రారంభమయ్యేవి. రైతులు, ప్రజల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు నదులు అనుసంధానం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తోంది. నది ఉంటేనే కదా నదుల అనుసంధానం చేయటానికి నదినే ఆక్రమించి కప్పెడితే నదుల అనుసంధానం లక్ష్యం ఎలా నెరవేరుతుంది అని నిపుణులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. భూములు, కొండలు ఆక్రమించుకుంది చాల్లేదు. ఇసుక, మట్టినీ అమ్ముకున్నారు. అవీ చాలక ఏకంగా నదినే మింగడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి ఫలితం అనుభిస్తారని హెచ్చరిస్తున్నారు.
 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments