Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారుపై అవిశ్వాస .. నోటీసిచ్చిన వైకాపా.. టీడీపీ మద్దతు?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మాన నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందజేసింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్‌‌సభ జనరల్ సెక్రటరీని కలసి నో

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (16:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మాన నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందజేసింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్‌‌సభ జనరల్ సెక్రటరీని కలసి నోటీసులను అందజేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఇస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిందని... ఆ తర్వాత హామీని విస్మరించిందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తమ అవిశ్వాస తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు.
 
వాస్తవానికి అవిశ్వాస తీర్మానాన్ని మార్చి 21న పెట్టాలని గతంలో వైసీపీ భావించింది. అయితే, వ్యూహాత్మకంగా ఆ తేదీని ముందుకు తీసుకొచ్చారు. అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ స్పందన కోసమే 21వ తేదీని నిర్ణయించినట్టు ఇంతకుముందు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో శరవేగంగా మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా వైకాపా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నిర్ణయించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా మద్దతు ఇద్దామని పార్టీ నేతలకు ఆయన స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments